Sunday, January 12, 2025

18000 పైన ముగిసిన నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

sensex
ముంబై: అక్టోబర్ 31న మూడో రోజున కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. నిఫ్టీ మళ్లీ 18000 మార్కును తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 786.74 పాయింట్లు లేక 1.31 శాతం పెరిగి 60746.59 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 225.40 పాయింట్లు లేక 1.27 శాతం పెరిగి 18012.20 వద్ద ముగిసింది. దాదాపు 1788 షేర్లు లాభపడగా, 1657 షేర్లు నష్టపోయాయి. 164 షేర్లు మార్పు లేకుండా యథాస్థానంలో ముగిశాయి. నిఫ్టీలో బాగా లాభపడిన షేర్లలో అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్, ఎం అండ్ ఎం, హెచ్‌డిఎఫ్‌సి, సన్‌ఫార్మా ఉండగా, నష్టపోయిన షేర్లలో అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎన్‌టిపిసి, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లోనే ముగిశాయి. బిఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1శాతం వృద్ధి చెందగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది. ఇదిలావుండగా డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ 30 పైసలు తగ్గి 82.77 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News