Sunday, January 19, 2025

ఆర్బీఐ నిర్ణయంతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -
sensex
ఆటో, పవర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, రియాల్టీ, మెటల్ 1-2 శాతం పెరిగాయి.

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత ఏడు సెషన్ల పాటు నష్ట పోయిన మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. రెపో రేటును అర శాతం పెంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,017 పాయింట్లు పెరిగి 57,427కి ఎగబాకింది. నిఫ్టీ 276 పాయింట్లు కోలుకుని 17,094కు చేరుకుంది. భారత రూపాయి విలువ డాలరుతో పోల్చినప్పుడు 50 పెరిగి 81.35 వద్ద ముగిసింది. రోజువారీ చార్ట్‌ ప్రకారం ఇండెక్స్ బుల్లిష్ ఎన్ గల్ఫింగ్  ప్యాటర్న్‌ను ఏర్పరచుకుంది. కాగా రోజువారీ RSI బుల్లిష్ క్రాస్‌ఓవర్‌లోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తోంది. నిఫ్టీ 276.25 పాయింట్లు లేక 1.64 శాతం పెరిగి 17094.35 వద్ద ముగిసింది. కాగా సెన్సెక్స్ 1016.96 పాయింట్లు లేక 1.80 శాతం పెరిగి 57426.92 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 984.20 పాయింట్లు లేక 2.61 శాతం పెరిగి 38631.95 వద్ద ముగిసింది. హిందాల్కో షేరు అత్యధికంగా లాభపడగా, ఏసియన్ పెయింట్స్ అత్యధికంగా నష్టపోయింది.

నిఫ్టీ ఇక 17,000 -16850 వద్ద  కీలక మద్దతుతో 17,500-17,700 జోన్‌ల వైపు కదలొచ్చు. ప్రస్తుతం నవరాత్రి పండుగ వేళ నెలవారీ అమ్మకాల డేటా, అధిక డిమాండ్ ప్రకారం ఆటో ,  వినియోగ రంగాలు ఊపందుకోవచ్చు. ప్రపంచ అనిశ్చితి సమయంలో మార్కెట్ రక్షణాత్మక పేర్లపై దృష్టి సారించడంతో ఫార్మా రంగం షేర్లు లాభపడుతున్నాయి.

బిఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (4.49%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.78%), బజాజ్ ఫైనాన్స్ (3.28%), కోటక్ బ్యాంక్ (3.22%), టైటాన్ (2.95%).

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-1.26%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.58%), ఐటీసీ (-0.32%), టెక్ మహీంద్రా (-0.23%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.18%).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News