Wednesday, January 22, 2025

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

 

sensex

ముంబై: భారతీయ ఈక్విటీ మార్కెట్ 8 రోజుల లాభాలకు నేడు(శుక్రవారం) తెరపడింది.  నిఫ్టీ 17,800 దిగువన ముగిసింది. కాగా ముగింపు సమయానికి సెన్సెక్స్ 651.85 పాయింట్లు లేదా 1.08% క్షీణించి 59,646.15 వద్ద, నిఫ్టీ 198 పాయింట్లు లేదా 1.10% క్షీణించి 17,758.50 వద్ద క్లోజయ్యాయి.  దాదాపు 1387 షేర్లు లాభపడగా,  1927 షేర్లు నష్ట 122 షేర్లు మారకుండా నిలిచాయి.

నిఫ్టీలో ప్రధానంగా  నష్టపోయిన వాటిలో   ఇండస్‌ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాగా అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో షేర్లు లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, పవర్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1 శాతం చొప్పున క్షీణించాయి. ఇక డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 10 పైసలు తగ్గి 79.78 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం క్షీణించింది. ప్రధానంగా ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ షేర్లు క్షీణింపజేశాయి. బిఎస్‌ఈ రియాల్టీ ఇండెక్స్ 0.6 శాతం పతనమైంది. డాలర్ విలువ నెల గరిష్ఠాన్ని తాకింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News