Sunday, December 22, 2024

నిఫ్టీ డౌన్.. సెన్సెక్స్ అప్

- Advertisement -
- Advertisement -

ముంబై : నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మళ్లీ మంగళవారం ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. 20,110 పాయింట్లతో గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే దీని తర్వాత సూచీ క్షీణించి 3 పాయింట్ల పతనంతో 19,993 వద్ద ముగిసింది. అంతకుముందు సోమవారం కూడా ఆల్ టైమ్ హైకి చేరుకుంది. సోమవారం ట్రేడింగ్‌లో 20,008 స్థాయిని తాకింది. అదే సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 67,221 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 15 లాభపడగా, 15 క్షీణించాయి. మంగళవారం స్మాల్‌క్యాప్ 4 శాతానికి పైగా పడిపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లో భారీ అమ్మకాలు కనిపించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.96 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.02 శాతం నష్టపోయాయి. దీంతో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు రూ.6 లక్షల కోట్లు కలిగిపోయింది. ఆర్‌ఆర్ కేబుల్ లిమిటెడ్ ఐపిఒ సెప్టెంబర్ 13 నుండి ప్రారంభమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News