Saturday, November 23, 2024

నిఫ్టీ @ 16,000

- Advertisement -
- Advertisement -

Nifty hits 16000 in historic day for Indian stock markets

 రికార్డు గరిష్టానికి చేరిన మార్కెట్ సూచీలు
మొదటిసారి 53,800 దాటిన సెన్సెక్స్
పటిష్టమైన ఆర్థిక డేటాతో మార్కెట్‌కు జోష్

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, ఆటో, ఐటి, కన్జూమర్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరుతో మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 837 పాయింట్లు అంటే 1.65 శాతం పెరిగింది. ఆఖరికి 53,823 పాయింట్ల వద్ద ముగిసింది. తొలిసారి సెన్సెక్స్ 53,800 పాయింట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. మరోవైపు నిఫ్టీ 16,000 పాయింట్ల మార్క్ ను దాటింది. చివరకు 245పాయింట్ల లాభంతో 16,130 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 27 షేర్లు లాభ పడ్డాయి.

రంగాల వారీగా చూస్తే, ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, ఆటో రంగాల నుండి మార్కెట్‌కు మద్దతు లభించింది. ఎన్‌ఎస్‌ఇలోని మూడు సూచీలు 1 శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. ఫార్మా రంగంలో సన్ ఫార్మా స్టాక్ 2.19 శాతం పెరిగి రూ.792 వద్ద ముగిసింది. ఎఫ్‌ఎంసిజి రంగంలో నెస్లే ఇండియా స్టాక్ 3.29 శాతం లాభపడి రూ.18,298 వద్ద స్థిరపడింది. ఆటో రంగంలో ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ వాటా 5.80 శాతం లాభంతో 1,165 వద్ద ముగిసింది.

రూ.240 లక్షల కోట్లు దాటిన లిస్టెడ్ కంపెనీల విలువ

బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కె ట్ క్యాప్ రూ .240.11 లక్షల కోట్లు దాటింది. బిఎస్‌ఇలో మొత్తం 3,376 షేర్లు ట్రేడ్ అయ్యాయి. వీటిలో 1,738 షేర్లు పెరగ్గా, మిగతా 1,505 షేర్లు నష్టపోయాయి. జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో భారతీ ఎయిర్‌టెల్ లాభం 63 శాతం తగ్గగా, అదానీ పోర్ట్ నికర లాభం 77 శాతం పెరిగింది. ఇక డాబర్ జూన్ త్రైమాసిక లాభం 28 శాతం పెరిగింది.

పెరుగుదలకు కారణాలు

 పటిష్టమైన ఆర్థిక డేటాతో జూలైలో మార్కెట్‌కు మద్దతు ఇచ్చింది
2021లో పారిశ్రామిక ఉత్పత్తి 9.7 శాతం పెరుగుతుందని అంచనా
2020 జూలై నుండి జిఎస్‌టి వసూలు 33.14 శాతం పెరిగింది
జూన్‌లో నిరుద్యోగ రేటు 9.17 శాతం నుండి 6.95 శాతానికి తగ్గింది
జూన్ త్రైమాసికంలో కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి
మూడింట ఒక వంతు కంపెనీలు ఉత్పత్తిని పెంచడంపై దృష్టిపెట్టాయి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News