Saturday, November 23, 2024

భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 402.73 పాయింట్లు లేక 0.65 శాతం లాభపడి 62,533.30కి ఎగబాకింది. నిఫ్టీ 110.85 పాయింట్లు లేక 0.60 శాతం పెరిగి 18,608 వద్ద స్థిరపడింది. టెలికాం, టెక్, ఐటీ సూచీలు ఒక శాతానికిపై పైగా పెరిగాయి.

టాప్ గెయినర్స్ గా  ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.46%), బజాజ్ ఫైనాన్స్ (1.75%), ఇన్ఫోసిస్ (1.65%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.60%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.59%) నిలువగా, టాప్ లూజర్స్ గా నెస్లే ఇండియా (-0.57%), టాటా స్టీల్ (-0.54%), మారుతి (-0.43%), టైటాన్ (-0.31%), డాక్టర్ రెడ్డీస్ (-0.17%) నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News