Saturday, January 11, 2025

16,250 పైన స్థిరపడిన నిఫ్టీ

- Advertisement -
- Advertisement -
Sensex
Sensex

ముంబై: టెక్నాలజీ, బ్యాంక్‌, మెటల్‌ స్టాక్స్‌లో లాభాల కారణంగా భారతీయ ఈక్విటీ సూచీలు సోమవారం వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలను విస్తిరించాయి. గత వారం చివరిలో వాల్ స్ట్రీట్‌లో బౌన్స్‌తో ఆసియా స్టాక్‌లు లాభపడ్డాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు ఊపందుకుంటున్నాయి ,  జూన్‌లో అమెరికా రిటైల్ అమ్మకాల పెరుగుదల పెట్టుబడిదారుల సెంటిమెంట్‌కు సహాయపడింది.స్వదేశ విషయానికి వచ్చినప్పుడు, 30-షేర్ల బిఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు 760 పాయింట్లు లేదా 1.41 శాతం ర్యాలీ చేసి 54,521 వద్ద ముగిసింది, కాగా ఎన్ఎస్ఈ  నిఫ్టీ 229 పాయింట్లు లేదా 1.43 శాతం పెరిగి 16,279 వద్ద స్థిరపడింది. బిఎస్‌ఈలో 2,354 షేర్లు లాభపడగా,  1093 నష్టపోయినప్పటికీ  మొత్తం మీద మార్కెట్ సానుకూలంగానే ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 1.40 శాతం , స్మాల్ క్యాప్ 1.59 శాతం పెరగడంతో మిడ్ ,  స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి, నిఫ్టీ ఫార్మా 0.09 శాతం, 0.15 శాతం చొప్పున పడిపోయాయి. కాగా సబ్-ఇండెక్స్‌లు నిఫ్టీ ఐటి, నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్,నిఫ్టీ మెటల్ వరుసగా 3.13 శాతం, 2.77 శాతం , 2.49 శాతం పెరగాయి. లాభపడ్డ స్టాక్స్ విషయానికొస్తే,  హిందాల్కో నిఫ్టీలో అగ్రస్థానంలో నిలిచింది, ఆ స్టాక్ 4.75 శాతం పెరిగి రూ. 367.20కి చేరుకుంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా , బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా లాభపడిన వాటిలో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, మారుతీ, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, ఎన్‌టిపిసి నష్టాల్లో ముగిశాయి. ఎల్ఐసి షేరు 1.72 శాతం నష్టపోయి రూ. 696.35 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News