Friday, December 20, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు !

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపరుల అమ్మకాలు, బలహీన త్రైమాసిక ఫలితాల కారణంగా అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకుంది. సెన్సెక్స్ లో స్వింగ్ తీవ్రంగా ఉండింది. సెన్సెక్స్ ఉదయం 77863.54(క్రితం ముగింపు 77580.31) తొలిత లాభాల్లో ప్రారంభమైంది. కానీ తర్వాత కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇక ఇంట్రాడేలో 76965.06 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఓ దశలో లాభాల్లోకి వచ్చినప్పటికీ లాభాల స్వీకరణతో మళ్లీ నష్టాల్లోకి చేరుకుంది. చివరికి 241.30 పాయింట్ల నష్టంతో 77339 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 78.90 పాయింట్ల నష్టాలతో 23453 వద్ద ముగిసింది. ప్రధానంగా లాభపడిన షేర్లలో హిందాల్కో, హీరో మోటార్ ,టాటా స్టీల్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ లీవర్ ఉండగా, ప్రధానంగా నష్టపోయిన షేర్లలో టిసిఎస్, డాక్టర్ రెడ్డి, ఇన్ఫీ, బిపిసిఎల్, సిప్లా ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 0.02 పాయింట్లు లేక 0.02 శాతం నష్టపోయి రూ. 84.39 వద్ద ట్రేడయింది. కాగా స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు  రూ. 669.00 లేక 0.90 శాతం పెరిగి రూ. 74615.00 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News