Sunday, January 19, 2025

గ్రామాలపై సాయుధ మూకల కాల్పులు: 160 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బొక్కొస్: నైజీరియాలోని పలు గ్రామాలపై సాయుధ మూకలు కాల్పులు జరపడంతో 160 మంది దుర్మరణం చెందారు. ఈ కాల్పులో వందల సంఖ్యలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలు బండిట్స్ అనే సాయుధ మూకలు ఈ దారుణానికి పాల్పడుతున్నాయి. నైజరీయాలో గత కొన్ని సంవత్సరాల నుంచి మతపరమైన, సామాజిక పరమైన ఘర్షణలు చోటుచేసుకోవడంతో వేలల్లో జనాలు చనిపోతున్నారు. కొన్ని తెగలకు చెందిన గ్రామాలపై బండిట్స్ అనే సాయుధ మూకలు కాల్పులకు పాల్పడడంతో 160 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడినట్టు సమాచారం. స్థానికులిని కిడ్నాప్ చేసి సొమ్ము కావాలని సాయుధ మూకలు డిమాండ్ చేస్తుంటాయి. 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన దాడుల్లో వేల సంఖ్యలో చనిపోయి ఉంటారని మీడియా వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News