4 గ్రాముల కొకైన్ స్వాధీనం
మనతెలంగాణ, హైదరాబాద్: నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్‌ను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, పంజాగుట్ట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి వద్ద నుంచి నాలుగు గ్రాముల కొకైన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నైజీరియా దేశానికి చెందిన డేనియల్ ఆయోటుండే ఓలామిండ్ స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చాడు. నగరంలోని టోలీచౌకి, డ్రీమ్ వ్యాలీలో ఉంటున్నాడు. ఢిల్లీలో ఉంటున్న నైజీరియాకు చెందిన జాన్‌పాల్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. డేనియల్ 2014లో హైదరాబాద్‌కు వచ్చాడు. నగరంలోని కూకట్‌పల్లి వివేకానంద డిగ్రీ కాలేజీలో చేరాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌కు బానిసగా మారాడు. అదేసమయంలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన జాన్‌పాల్‌తో పరిచయం ఏర్పడింది. అతడి సలహాతో డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. డ్రగ్స్ విక్రయిస్తుండడంతో లంగర్‌హౌస్ పోలీసులు గతంలో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితుడు ఏమాత్రం మారలేదు. మళ్లీ అవసరం ఉన్న వారికి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. అవసరం ఉన్న వారికి కొకైన్ గ్రాములకు రూ.8,000 నుంచి రూ.10,000 తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కొకైన్ విక్రయించేందుకు జివికె మాల్ సమీపంలో బైక్‌పై ఉండగా సమాచారం తెలుసుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, పంజాగుట్ట పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు నరేందర్, శ్రీశైలం, ఎండి తకియుద్దిన్, చంద్రమోహన్ తదితరులు పట్టుకున్నారు.