Monday, December 23, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : డ్రగ్స్ విక్రయిస్తు నైజీరియాకు చెందిన యువకుడిని హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 5గ్రాముల కొకైన్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నైజీరియాకు చెందిన ఓజెంగువా ఇమాన్యుయేల్ ఓసుండు స్టూడెంట్ విసాపై 2016లో ఇండియాకు వచ్చాడు. అప్పటి నుంచి ముంబాయిలో ఉంటున్నాడు.

సులభంగా డబ్బులు సంపాదించాలని మొదట్లో కొకైన్‌ను సరఫరా చేసేవాడు. ఈ క్రమంలోనే గోరేగావ్ పోలీసులు డిసెంబర్2020లో అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత డ్రగ్స్ డీలర్ లెవల్ అరుణ్ వద్ద తక్కువకు డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నాడు. అతడి ఆదేశాలతోనే హైదరాబాద్‌లో అవసరం ఉన్న వారికి డ్రగ్స్ విక్రయించేందుకు వచ్చాడు. ఈ విషయం బహదుర్‌పుర పోలీసులు, నార్కొటిక్ పోలీసులకు తెలియడంతో పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సై జిఎస్ డానియల్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News