Monday, December 23, 2024

పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయం… నైజీరియన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి కోట్ల రూపాయల విలువైన హెరాయిన్, కొకైన్, తొమ్మిది ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ దేశస్థుడు స్టాన్లీ గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 2015లో నార్కోటిక్ బ్యూరో అధికారులకు స్టాన్లీ పట్టుబడ్డాడు. దేశ వ్యాప్తంగా స్టాన్లీ వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News