Monday, December 23, 2024

కడుపులో రూ. 15 కోట్ల విలువైన కొకైన్ : నైజీరియా వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

71 కాప్సూల్స్ రూపంలో రూ. 15.61 కోట్ల విలువైన కొకైన్‌ను కడుపులో దాచుకున్న నైజీరియా వ్యక్తిని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఈనెల 3 న అడ్డిస్ అబబా (ఇథియోపియా) నుంచి రాగా, పట్టుకున్నట్టు కస్టమ్స్ విభాగం ప్రకటనలో పేర్కొంది. నిందితుని కదలికలపై అనుమానం వచ్చి పట్టుకుని విచారించగా, తాను మాదక ద్రవ్యాలతో కూడిన కాప్సూల్స్ కొన్నిటిని మింగినట్టు ఒప్పుకున్నాడని అధికారులు తెలిపారు. మింగిన కొకైన్‌ను కక్కించడానికి నిందితుడిని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మొత్తం 71 కొకైన్ కాప్సూల్‌ను బయటకు తీయడానికి చాలా రోజులు పట్టింది. మొత్తం 1041 గ్రాముల తెల్లని కొకైన్ పౌడర్ విలువ రూ. 15.61 కోట్లు చేస్తుందని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News