Monday, January 20, 2025

దక్షిణ ముంబైలో 8 మందిని కత్తితో గాయపరిచిన నైజీరియన్!

- Advertisement -
- Advertisement -

 

Nigerian attacked pedestrians

ముంబై: దక్షిణ ముంబైలోని చర్చ్‌గేట్ ప్రాంతంలో నిన్న నైజీరియన్ వ్యక్తి పాదచారులపై కత్తితో దాడి చేయడంతో కనీసం 8 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పార్సీ బావి సమీపంలోని టాటా గార్డెన్‌లో ఈ ఘటన జరిగినట్లు దక్షిణ ముంబై అదనపు పోలీసు కమిషనర్ దిలీప్ సావంత్ తెలిపారు. జాన్ అనే 50 ఏళ్ల నైజీరియన్ ఒక మహిళతో కూర్చొని ఉండగా,  అకస్మాత్తుగా లేచి తన కత్తిని బయటకు తీసి ఆ దారిన వెళుతున్న బాటసారులపై దాడి  ప్రారంభించాడని, ఈ ఘటనలో కనీసం ఏడెనిమిది మంది గాయపడ్డారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన రహదారిపై రక్తపు మరకలను చూపే వీడియోలు సామాజిక మాధ్యమంలో వెలుగుచూశాయి.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియలేదని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News