Monday, January 20, 2025

నైజీరియాలో గురితప్పిన ఆర్మీ డ్రోన్.. 85 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అబుజా : వాయువ్య నైజీరియాలో ఆదివారం మతపరమైన వేడుకపై పొరపాటున ఆర్మీ డ్రోన్ గురితప్పి దాడి చేయడంతో 85 మంది ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు వెల్లడించాయి. కదువా రాష్ట్రం లోని ఇగాబీలో ఆదివారం రాత్రి ఒక మతవేడుక జరుపుకుంటున్న కొందరిపై అకస్మాత్తుగా డ్రోన్ బాంబు పడింది. నైజీరియా సమస్యాత్మక జోన్లలో వరుసగా డ్రోన్లు గురితప్పి జనావాసాలపై ఈ దాడి జరుగుతుండడంపై దేశాధ్యక్షుడు బొలా టినుబు మంగళవారం దర్యాప్తుకు ఆదేశించారు.

ఇంతవరకు 85 మృతదేహాలను పూడ్చిపెట్టామని, నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఇఎంఎ) వెల్లడించింది. బాధితుల్లో పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని పేర్కొంది. 2017 నుంచి వైమానిక దాడుల వల్ల 400 మందివరకు పౌరులు మృతి చెందారని మిలిటరీ వెల్లడించింది. ఈ విధంగా గురి తప్పిన వైమానిక దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయని నైజీరియా మాజీ ఉపాధ్యక్షులు అటికు అబుబకర్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు బరితెగించి జనావాసాలపై తరచుగా దాడులకు దిగుతున్నారని నైజీరియా రక్షణ ప్రధాన కేంద్రం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఎడ్వర్డ్ బూబా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News