Sunday, December 22, 2024

భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. నైజీరియా మహిళ అరెస్టు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టిన పోలీసులు..
50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌ ను గుర్తించి సీజ్‌ చేశారు. డ్రగ్స్ తరలిస్తున్న నైజీరియాకు చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారైనట్లు తెలిపారు.

బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దంపతులతో పాటు మరో ముగ్గురు ఈ డ్రగ్స్‌ దందా చేస్తున్నారని పోలీసులు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News