Sunday, December 22, 2024

జూబ్లీహిల్స్ నైట్ క్లబ్బులో విదేశీ జంతువులు?

- Advertisement -
- Advertisement -
పోలీసులు, అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ‘జోరా’ నైట్ క్లబ్‌లో ఇటీవల విదేశీ జంతువులను ప్రాంగణంలో ప్రదర్శించడం కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. సోషల్ మీడియాలో బాగా వేగంగా విస్తరించింది. దాంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 36లో ఉంది ఈ ‘జోరా’అనే ప్రసిద్ధ నైట్ క్లబ్. ఇక్కడ అదిరిపోయే జంతువులను ప్రదర్శించడం జనాలను కలవర పెట్టింది. ఆ జంతువుల ఫుటేజీలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిని అనేక మంది విమర్శించారు.
జూబ్లీ హిల్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దర్యాప్తు జరుపుతున్నట్లు ‘సియాసత్’ దినపత్రిక విలేకరికి తెలిపారు. కాగా ఇంతవరకు దీనిపై ఎలాంటి ఫిర్యాదు ఎవరి నుంచి నమోదు కాలేదు. కాగా ‘జోరా’ మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసింది. న్యాయపరంగా లైసెన్సు, పర్మిట్లు పొందాకే తాము షో చేస్తున్నట్లు తెలిపింది. ఈవెంట్స్‌లో ఎలాంటి హానీ జరుగలేదని, జంతువుల సంక్షేమం తమకూ ముఖ్యమేనని పేర్కొంది. జంతువులను తాము చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంటామని జోరా టీమ్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News