Friday, November 22, 2024

పంజాబ్‌లో నైట్ కర్ఫ్యూ విధింపు…

- Advertisement -
- Advertisement -

Night curfew imposed in Punjab

చండీగఢ్: కరోనా వ్యాప్తి దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాజకీయ సభలు, సమావేశాలపై నిషేధం విధించింది. కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల పెరుగుతున్నందున ప్రభుత్వం నెల చివరి వరకు నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ  రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 సంబంధిత ఆంక్షలను ఏప్రిల్ 10 వరకు పొడిగించాలని పంజాబ్ సర్కార్ గతంలో ఆదేశించింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం, కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న లూధియానా, పాటియాలాతో సహా ఇటువంటి జిల్లాలను తొమ్మిది నుండి 11 వరకు పొడిగించాలని నిర్ణయించింది. తాజాగా పంజాబ్ లో 62 మంది కరోనా వైరస్ తో మరణించగా, కొత్తగా 2,900 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది.

Night curfew imposed in Punjab

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News