Monday, December 23, 2024

ప్రయాణికులకు మరింత చేరువగా గ్రేటర్ ఆర్‌టిసి

- Advertisement -
- Advertisement -

Night rider buses in Hyderabad

తాత్కాలిక బస్ షెల్టర్లు
నైట్ రైడర్ బస్సులు

మన తెలంగాణ, హైదరాబాద్ :  నష్టాల్లో ఉన్న ఆర్‌టిసిని లాభాల బాటలో ప్రయాణింప చేసేందుకు ఆర్‌టిసి అధికారులు తమకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నగర ప్రజల రవాణ అవసరాలు తీర్చేందుకు సంస్థకు సరిపోని బస్సులు లేకపోయిన నప్పటికి లోటు ఎక్కడా రానీయకుండా అధికారులు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే రద్దీ లేని రూట్లులో తిరిగే బస్సుల సంఖ్యను తగ్గించి రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిప్పుతున్నారు.అంతే కాకుండా రాత్రి 9 గంటలు దాటితే బస్సులు తిరగడం లేదన్న ఫిర్యాదులపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

ఇందులో భాగంగా నైట్ రైడర్ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా గ్రేటర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ నైట్ రైడర్ బస్సులు అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము (3.30 గంటల )వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. రూట్ నెం ః 219 సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరువరకు, రాణిగంజ్ 1 డిపోకు చెందిన బస్సులు బిహెచ్‌ఈఎల్ మార్గం రాత్రి 12.15 నిమిషాల నుంచి ఉదయం 3.30 గంటల వరకు నడుపుతున్నారు. ఈ బస్సులు సికింద్రాబాద్, ప్యారడైజ్,ట్యాంక్‌బండ్, బాలానగర్,కూకట్‌పల్లి,మియాపూర్, లింగంపల్లి,అశోక్‌నగర్ మీదుగా పటాన్ చెరువరకు ఈ నైట్ రైడర్ బస్సులు ప్రయాణికులకు అందుబాటలో ఉంటాయి. ప్రయోగాత్మకంగా నడుపుతున్న బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన ఉంటే గ్రేటర్ వ్యాప్తంగా ఇదే పద్దతిని పాటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

తాత్కాలిక షెడ్లతో ప్రయాణికుల వేసవి సమస్యలకు చెక్ 

గ్రేటర్‌లో జరుగుతున్న పలు అభివృద్ది పనులు, ( ఫ్లై ఓవర్‌ల నిర్మాణం, రోడ్లు వెడల్పు తదితర) కారణంగా బస్టాపులను తొలగించడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మండు వేసవిలో బస్సుల కోసం ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై మీడియాలో వరుస కథనాలు రావడంతో వీటిపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తాత్కాలిక బస్‌షెల్టర్లు( షామియానాలు,తాటిఆకుతో కూడిన పందిర్లి, గోనేసంచిలతో)ను గ్రేటర్‌ర్‌లోని భరత్‌నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ టెంపుల్, రామచంద్రాపురం,ఉప్పల్ రేణాకా వైన్స్, యాప్రాల్, కెజిఎక్స్ రోడ్స్,తూము కుంట,సికింద్రాబాద్ స్టేషన్ ప్రాంతంలో 18 పాయింట్లలో,కొత్తగూడ ఎక్స్‌రోడ్,జియాగూడ గాంధీ విగ్రహం, పీవర్ ఆసుపత్రి,అడిక్‌మెట్,నారాయణగూడ, బర్కత్‌ఫురా,అఫ్జల్‌గంజ్,జిల్లెల గూడబస్టాప్,జైపూర్ కాలనీ (72జె),మన్నెగూడ, ఎల్‌బినగర్,ఇబ్రహీం పట్నం, ఉప్పల్ ప్రాంతాల్లో ప్రయాణికుల వేసవి సమస్యలు తాత్కాలికంగా తీర్చేందుకు బస్‌షెల్టర్లను ఏర్పాటు చేసింది. వీటినే కాకుండా అంతర్జాతీయ మహిళాదినోత్సవం, చిల్డ్రన్స్ డే తదిర ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికులకు రాయితీలను ఇస్తూ వారికి సంస్థకు చేరువచేసి లాభాలబాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News