Sunday, November 3, 2024

యూపి ఫ్యాక్టరీల్లో మహిళలు రాత్రిపూట కూడా పనిచేసేందుకు లైన్ క్లియర్!

- Advertisement -
- Advertisement -

 

Night duty for women in UP

లక్నో: మహిళలు రాత్రిపూట కూడా ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు వీలుకల్పిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అయితే ఆయా ఫ్యాక్టరీలు రాత్రిపూట పనిచేసే ఉద్యోగినులకు భద్రత, రక్షణ కల్పించాలని షరతు విధించింది. ఈ కొత్త రూల్ ప్రకారం ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగినులు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసే వీలుంటుందని లేబర్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సురేశ్ చంద్రం శనివారం తెలిపారు. ‘ఇకపై ఎవరైనా మహిళలు రాత్రిపూట పనిచేయాలనుకుంటే వారు తమ సమ్మతిని రాతపూర్వకంగా తెలుపాల్సి ఉంటుంది’ అని ఆయన ఓ పత్రికకు తెలిపారు. “ఇప్పటి వరకు ప్రత్యేక అనుమతి లేకుండా మహిళలను రాత్రి పూట పనిచేయించే అనుమతి ఉండేది కాదు. కానీ ఇకపై వారిని కూడా నైట్ షిఫ్ట్‌లకు అనుమతిస్తారు. అయితే ఈ నియమాలు కేవలం ఫ్యాక్టరీల్లోనే పనిచేస్తాయి” అని ఆయన తెలిపారు. రాత్రిపూట పనిచేయాలనుకునే మహిళల అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది అని కూడా ఆయన అన్నారు. నైట్ డ్యూటీ చేసే మహిళలకు ఇంటి నుంచి పనిచేసే స్థలానికి తేడానికి, దించడానికి రవాణా సదుపాయం కూడా కల్పించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News