- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె అయిన నటి, నిర్మాత నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నిహారిక, చైతన్య జొన్నలగడ్డ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. కాగా 2020 డిసెంబర్‌లో నిహారిక వివాహం గుంటూరు ఐజి జె.ప్రభాకర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈ పెళ్లి జరిగింది. వివాహం అనంతరం సినిమాలకు కొంత కాలంగా దూరంగా ఉన్న నిహారిక ఇటీవల ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.
- Advertisement -