Monday, January 20, 2025

పబ్​లో పట్టుబడిన వారిలో సినీ నటి నిహారిక

- Advertisement -
- Advertisement -

Niharika Konidela detained by Banjara Hills police

హైదరాబాద్: బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భగ్నం చేశారు. ఈ తనిఖీల్లో నటి నిహారిక పట్టుబడింది. పోలీసులు నిహారికకు నోటీసులు ఇచ్చి పంపినట్టు సమాచారం. పోలీసుల దాడుల్లో ప్రముఖులు, సెలబ్రిటీల పల్లలు కూడా పట్టుబడ్డారు. పోలీసులు రావడంతో యువతీయువకులు పబ్ కిటికీల్లోంచి డ్రగ్స్ విసిరేశారు. పబ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇటీవలే హైదరాబాద్ లో డ్రగ్స్ వాడుతూ తొలి మరణం సంభవించిన విషయం తెలిసిందే. పార్టీలో మాజీ డిజిపి కూతురు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అరవింద్, హేమ, గున్నిరాజు, సతీష్ రాజ్, నిహారిక, గల్లా జయదేవ్ కొడుకు, రేణుకా కూతురు తేజస్విని, కిరణ్ రాజు, సతీష్ రాజు పేరుతో పబ్ రిజిష్టర్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రేవ్‌ పార్టీని నిర్వహిస్తున్న పబ్‌ యజమానులు సహా సుమారు 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్‌ సిబ్బంది ఉన్నారని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News