Thursday, January 9, 2025

అల్లుఅర్జున్ ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటకు వస్తున్నాడు: నిహారిక

- Advertisement -
- Advertisement -

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన తనను ఎంతో భాదించిందని నాగబాబు కూతురు నిహారిక అన్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రేతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తాజాగా ఈ ఘటనపై నిహారిక తొలిసారి స్పందించారు. తను నటించిన ‘మద్రాస్‌ కారన్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక.. ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఇది తనను బాధకు గురిచేసిందని, ఈ ప్రమాదం గురించి తెలిసి తన మనసు ముక్కలైందని చెప్పారు. ఇలాంటి ఘటనలను ఎవరూ ఊహించరన్నారు. ఈ ఘటన తర్వాత అల్లుఅర్జున్ ఎంతో బాధపడ్డారని.. అందరి ప్రేమాభిమానాల వల్ల ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తున్నారని నిహారిక తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News