Monday, December 23, 2024

సెల్‌బే షోరూంలో రెడ్మీ నోట్ 12 సిరిస్ ను ఆవిష్కరించిన సినీనటి నిహారిక కొణిదెల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గచ్చిబౌలి : మల్టీ బ్రాండ్ రిటైల్ సంస్థ అయిన సేల్‌బే అధునాతన హ్యండ్‌సెట్ రెడ్మీ నోట్ 12(5జి) సిరిస్ ను ప్రారంభించింది. ఈ సిరిస్ ను గచ్చిబౌలిలోని స్టోర్ లో సినీనటి, ప్రొడ్యుసర్ నిహారిక కొణిదెల బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. అత్యుత్తమైన ఉత్పత్తులు, సేవలను నిరంతరం అందిస్తూ కస్టమర్ల నమ్మకానికి అనుగుణంగా సెల్‌బే సంస్థ ముందుకు సాగుతుందని అన్నారు. ఎల్లవేళాల మొదటి స్థానంలో నిలిచే ఉత్పత్తులలో రెడ్మీ నోట్ 12(5జి) సిరీస్ కూడా ఒకటి అని అభిప్రాయపడ్డారు. 200 ఎంపి కెమెరా, 19 నిమిషాలలోనే చార్జీంగ్ కెపాసిటితో 120 వాట్స్ హైపర్ ఛార్జ్ అధునాతన ఫీచర్లతో కస్టమర్లకు ఎంతో ఆకర్షనీయంగా ఉందని ఆమే తెలిపారు.

అనంతరం సెల్‌బే మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు మాట్లాడుతూ.. ఈ సూపర్ నోట్ సిరిస్ ను ప్రారంభించడం, షియోమీ ఇండియా తదుపరి తరం కనెక్టీవిటీ యొక్క భవిష్కత్తును మరియు 5జి ని అందరికి అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని, అన్ని అధునాతన ఫీచర్స్ తో రెడ్మీ నోట్(5జి) సిరస్ ఎంతో ఆకర్షనీయంగా కస్టమర్ల నమ్మకానికి తగ్గట్టుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెల్‌బే వైస్ ప్రెసిడెంట్ శ్రీకష్ణ ప్రసాద్, ఆంధ్ర, తెలంగాణ షియోమి సీనియర్‌య మేనేజర్ శివకృష్ణ, మార్కేటింగ్ మేనేజర్ మరియు సెల్‌బే బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News