Tuesday, December 24, 2024

నవీన్ హత్య కేసు జైలు నుంచి విడుదలైన నిహారిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో నిందితురాలు నిహారిక జైలు నుంచి విడుదలైంది. ఈ కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న నిహారికను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చర్లపల్లి జైలు నుంచి నిహారిక ఆదివారం ఉదయం విడుదలైంది. నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు సహకరించారన్న ఆరోపణలతో హసన్, నిహారికను పోలీసులు ఫిబ్రవరి 6న అరెస్ట్ చేశారు. హత్య జరిగిన విషయాన్ని దాచి, హత్యకు సహకరించిందని నిహారికను కూడా నిందితు రాలిగా చేర్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హయత్ నగర్ కోర్టులో వారిద్దరినీ హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషి యల్ రిమాండ్ విధించారు. ఇటీవల బెయిల్ కోసం నిహారిక దరఖాస్తు చేసుకోగా శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆదివారం ఆమె బయటికొచ్చింది. తన స్నేహితుడు నవీన్ ను హరిహరకృష్ణ కిరాతకంగా హత్య చేశాడు. నవీన్ శరీరాన్ని ముక్కలుగా కోసి గుండెను బయటికి తీశాడు. నిహారికను వేధిస్తున్నాడనే కోపంతోనే నవీన్‌ను చంపినట్లు పోలీసుల విచారణలో హరిహరకృష్ణ ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News