Saturday, November 23, 2024

నీరా రాడియాకు డజన్లకొద్దీ సంస్థలు…

- Advertisement -
- Advertisement -

Niira Radia

ముంబయి: నీరా రాడియా ఓ కార్పొరేట్ లాబీయిస్టు అని పండోరా పేపర్లు పేర్కొంటున్నాయి. ఆమె లండన్‌లోని సంజయ్ నెవాటియా ద్వారా విదేశీ లావాదేవీలు నిర్వహిస్తుంటుంది. రాడియా పేరు ఇదివరలో పనామా పేపర్లలో, పారడైజ్ పేపర్లలో కూడా వచ్చింది. ఇప్పుడు పండోరా పేపర్లలో ఆమె పేరు దర్శనమిస్తోంది.

రాడియాకు ఇర్థెమా అసోసియేషన్ లిమిటెడ్, రాక్స్‌బరీ ఎస్టేట్ లిమిటెడ్ ఎల్‌మాషే హోల్డింగ్స్ లిమిటెడ్, థైయెరే ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, మలగా ఓవర్సీస్ లిమిటెడ్, కాలెట్స్ ట్రేడింగ్ లిమిటెడ్, కింగ్‌స్టన్ ఇంటరేషనల్ లిమిటెడ్, హిమ్‌లెన్ ట్రేడింగ్ ఎస్‌ఎ, జిల్లా లిమిటెడ్, కోయిస్ హోల్డింగ్ లిమిటెడ్, మెహోన్ కన్సల్టెంట్స్ లిమిటెడ్, నైనే హోల్డింగ్స్ లిమిటెడ్స్ వంటి కంపెనీలతో సంబంధాలున్నాయి.

అయితే ఓ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా ఆమె ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడవుతున్నాయి. కానీ ఆమె మాత్రం వారు పేర్కొన్న కంపెనీల్లో తనకు వాటాలు కూడా లేవంటున్నారు.

2010లో ఆమె ’రాడియా టేప్‘ అనే ఫోన్ సంభాషణల కుంభకోణం ద్వారా నాడు వార్తల్లోకి వచ్చారు.  రెండో యుపిఎ సర్కారు కాలంలో ఆమె జర్నలిస్టులను, రాజకీయనాయకులను ప్రభావితం చేశారని కథనం. అపట్లో ఆమె అనేక దర్యాప్తు సంస్థల నిఘాలోకి వచ్చారు. 2011లోఆమె తన ప్రజాసంబంధాల సంస్థ వైష్ణవి కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌ను మూసేశారు.
ఆమె తాజాగా ట్రైడెంట్ ట్రస్ట్‌ను తనను నేరుగా కాంటాక్ట్ చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. ఆమె సోదరి కరుణా మీనన్ ఆమె బిజినెస్ భాగస్వామి అని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News