Sunday, January 19, 2025

మొట్టమొదటి ఫౌండర్స్‌ గ్రోత్‌ క్యాంప్‌ను నిర్వహించిన నిట్‌ యూనివర్శిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉన్నత విద్యలో ఆవిష్కరణలను తీసుకురావడంతో పాటుగా విజ్ఞాన సమాజంలో అభివృద్ధి చెందుతున్న రంగాలలో అభ్యాసాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రారంభమైన నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) తమ క్యాంపస్‌లో మొట్టమొదటిసారిగా ఫౌండర్స్‌ గ్రోత్‌ క్యాంప్‌ను నిర్వహించింది. తొలి దశ ఎడ్‌టెక్‌ సంస్ధల ఫౌండర్లు అయిన ఎయిర్‌బ్లాక్‌కు చెందిన విదేత్‌ జైశ్వాల్‌, ఎడ్‌యోధ నుంచి అర్మాన్‌ అహ్మద్‌, ఎక్స్‌పెర్టాన్స్‌ నుంచి జతిన్‌ సోలంకి; ఇన్సైడ్‌ నుంచి మన్వీందర్‌ సింగ్‌; పర్సెపెక్ట్‌ ఏఐ నుంచి జిగ్నేష్‌ తలసిల, స్కూల్‌ ఆఫ్‌ యాక్సలరేటెడ్‌ లెర్నింగ్‌ నుంచి ప్రతీక్‌ అగర్వాల్‌; ఉలేక్ట్జ్‌ లెర్నింగ్‌సొల్యూషన్స్‌ నుంచి రమణ్‌ తల్వార్‌, వాణి డాట్‌ కోచ్‌ నుంచి రష్మీ ఝా లు మూడు రోజుల సదస్సులో పాల్గొన్నారు.

ఈ సదస్సులో పాల్గొన్న ఫౌండర్లు తమ ఆలోచనలను ఏంజెల్‌ ఇన్వెస్టర్లు, పరిశ్రమ నాయకులు, నిపుణుల ముందు ప్రదర్శించుకునే అవకాశం కలిగింది. నిట్‌ గ్రూప్‌ కో–ఫౌండర్‌, ఛైర్మన్‌ రాజేంద్ర ఎస్‌ పవార్‌ మాట్లాడుతూ ‘‘నా అభిప్రాయంలో ఎడ్‌టెక్‌ అత్యంత కఠినమైన రంగం. అభ్యాసం కోసం సాంకేతిక వేదికను సృష్టించడం అంత సులభమేమీ కాదు. ఈ రంగంలో విజయవంతం కావాలంటే వినూత్నమైన ఆలోచనలు కావాలి. భారతదేశంలో ఈ రంగం నిధుల కొరతతో ఇబ్బంది పడుతుంది. గత 40 సంవత్సరాలుగా మేము విద్యారంగంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల, మేము తగిన పర్యావరణ వ్యవస్ధను యువ స్టార్టప్స్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము’’అని అన్నారు.

ఈ మూడు రోజుల సదస్సులో ఎడ్‌టెక్‌ ఫౌండర్లకు పరిశ్రమ నిపుణులు, సంభావ్య మదుపరులు, సహచర సంస్ధల సభ్యులను కలుసుకునే అవకాశం కలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News