అమరావతి: “నిజం గెలవాలి” పేరిట బుధవారం నుంచి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. టిడిపి అధినేత, చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాను భువనేశ్వరి పరామర్శిస్తారు. రాయలసీమ జిల్లాల నుంచి భువనేశ్వరి పర్యటన ప్రారంభంకానుంది. ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలో భువనేశ్వరి నిజం గెలివాలి కార్యక్రమాలు జరుగనుంది. చంద్రబాబు అరెస్టుతో అవేదన చెంది చిన్నబ్బ, ఎ ప్రవీణ్ రెడ్డి మృతి చెందాడు. చంద్రగిరికి చెందిన ఎ ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించనున్నారు.
నేండ్రగుంటకు చెందిన చిన్నబ్బ కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు. మధ్యాహ్నం అగరాలలో నిజం గెలవాలి కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి ఆమె వెళ్లనున్నారు. ఆమె పరామర్శించడంతో పాటు సభలు సమావేశాల్లో పాల్గొంటారని టిడిపి వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలపనున్నారు. గురువారం తిరుపతి, శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం ఉంటుంది.
Also Read: డికె అరుణ దారెటు?