Wednesday, November 13, 2024

నిజ్జర్ సన్నిహితుడు, ఖలిస్థానీ ఉగ్రవాది కెనడాలో అరెస్ట్ !

- Advertisement -
- Advertisement -

టోరంటో : భారత్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఖలిస్థానీ ఉగ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష్‌దల్లా ఎట్టకేలకు పోలీస్‌ల చేతికి చిక్కాడు. కెనడా పోలీసులు అతడిని అరెస్టు చేసినట్టు సంబంధిత వర్గాల సమాచారం. గత నెల కెనడా లోని ఓ పట్టణంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంఘటనలో అర్ష్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌కు అర్షదీప్‌సింగ్ సన్నిహితుడు. అక్టోబర్ 27, 28న మిల్టన్ పట్ణణంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంఘటనలో ఇతడి ప్రమేయం ఉన్నట్టు పోలీస్‌లు గుర్తించారు.

కెనడా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు , పోలీస్‌లు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. తాజాగా అతడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. భారత్‌లో వివిధ నేర కార్యకలాపాల్లో అర్షదీప్ ప్రమేయం ఉంది. ప్రస్తుతం అతడు భార్యతో కలిసి కెనడాలో నివసిస్తున్నాడు. అక్కడి నుంచే పంజాబ్‌లో నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. కాంగ్రెస్ నాయకుడు బల్జీందర్‌సింగ్ బల్లి హత్యకు కారణమయ్యాడు. తన తల్లి పోలీస్‌ల కస్టడీలో ఉండడానికి కాంగ్రెస్ నేత కారణమని, అందుకే హత్యకు పాల్పడినట్టు గతంలో పోస్ట్ చేశాడు. మరిన్ని నేరాలకు పాల్పడడంతో భారత్ ఇతడిని వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. అర్షదీప్ సహాయకులను అరెస్ట్ చేసింది. తాజాగా అతడి అరెస్ట్‌పై భారత్‌కు సమాచారం అందినట్టు తెలుస్తోంది. కెనడా అధికారులతో న్యూఢిల్లీ అధికారులు సమన్వయం కానున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News