Wednesday, January 22, 2025

పాకిస్థాన్ నాటకాలలో ‘నిఖా’ చేసుకున్నా చెల్లుబాటవుతుంది !?

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ నటీనటులు నాటకాలు, సీరియల్స్ లో సైతం ‘నిఖా’ (నిశ్చితార్థం) చేసుకున్నా వారు పెళ్లి చేసుకోవలసిందేనంటూ ఓ మతపెద్ద(క్లెరిక్) చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

పాకిస్థాన్ మోడల్, నటి నాదియా హుస్సైన్ దీనిపై స్పందించారు. టెలివిజన్ డ్రామాలలో జరిగే ‘నిఖా’కల్పితమని, అది ఇస్లామీయ పెళ్లి కట్టుబాట్లకు వర్తించదని వ్యాఖ్యానించారు. పైగా నాటకాలు, సీరియల్స్ లో ఉండే పాత్రలు, పేర్లు అన్ని కల్పితాలేనని ఆమె వ్యాఖ్యానించారు. అది ఇస్లామీయ పెళ్లి రీతి రివాజులకు వర్తించదని అన్నారు.

ఉరూజ్ మన్సబ్ ఖాన్ అనే నెటిజన్ అయితే డ్రామాలు, సీరియల్స్ లో పేర్కొనే అప్పులు చెల్లుబాటవుతాయా, ఉత్తుత్తి విదేశీ అప్పులు ఐఎంఎఫ్ కిందికి వస్తాయా? అని ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News