Tuesday, April 8, 2025

నిఖత్ ఆశలు గల్లంతు

- Advertisement -
- Advertisement -

ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి

పారిస్: ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తుందని భావించిన తెలంగాణ యువ సంచలనం, భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లోనే ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన మహిళల 50 కిలోల విభాగంలో నిఖత్ పరాజయం చవిచూసింది. ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న నిఖత్ చైనా బాక్సర్ వు హు చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది.

ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నిఖత్ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమైంది. ప్రత్యర్థి ధాటికి ఎదురు నిలువలేక 05 తేడాతో ఓడిపోయింది. వు హు ఈ మ్యాచ్‌లో అద్భుత ఆటను కనబరిచింది. అద్భుత పంచ్‌లతో నిఖత్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరికి అలవోక విజయంతో ముందంజ వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News