Friday, January 3, 2025

ఫైనల్లో నిఖత్ జరీన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత స్టార్ బాక్సర్, తెలుగుతేజం నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మకమైన స్ట్రాంజా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. నిఖత్ జరీన్ ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. శనివారం జరిగిన 50 కిలోల విభాగం సెమీ ఫైనల్లో నిఖత్ 50 తేడాతో బల్గేరియాకు చెందిన చుకనొవాను ఓడించింది. ఆరంభం నుంచే నిఖత్ దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగింది. కళ్లు చెదిరే పంచ్‌లతో హడలెత్తించిన నిఖత్ అలవోక విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా, బల్గేరియాలోని సోఫియా నగరం వేదికగా ఈ పోటీలు జరుతున్నాయి. ప్రపంచకప్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన టోర్నమెంట్‌గా స్ట్రాంజా కప్ పేరు తెచ్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News