Wednesday, January 22, 2025

సెమీ ఫైనల్లో నిఖత్ జరీన్

- Advertisement -
- Advertisement -

సోఫియా (బల్గేరియా): ప్రతిష్ఠాత్మకమైన స్ట్రాంజా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన 50 కిలోల క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ 50 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన లాదిరా వసిల్లాను ఓడించింది. ఆరంభం నుంచే నిఖత్ దూకుడును ప్రదర్శించింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు ఆధిపత్య కాపాడుకుంటూ అలవోక విజయంతో సెమీస్‌కు చేరుకుంది. మరోవైపు 66 కిలోల విభాగంలో భారత్‌కు చెందిన అరుంధతి చౌదరీ సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అరుంధతి సెర్బియాకు చెందిన మాటొవిక్ మిలెనాను ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News