Thursday, January 23, 2025

ఫైనల్లో నిఖత్ జరీన్

- Advertisement -
- Advertisement -

పర్వీన్, మనీషాలకు కాంస్య పతకాలు
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్


ఇస్తాంబుల్(టర్కీ): ఇక్కడ జరుగుతున్న ప్రపంచ మహిళల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఫైనల్‌కు చేరుకొంది. బుధవారం జరిగిన 52 కిలోల విభాగం సెమీఫైనల్లో తెలుగుతేజం నిఖత్ జయకేతనం ఎగుర వేసింది. ఏకపక్షంగా సాగిన పోరులో నిఖత్ 50 తేడాతో బ్రెజిల్‌కు చెందిన కరోలైన్ డి అల్మేదాను ఓడించింది. ఇక ఫైనల్లో జరీన్ థాయిలాండ్ బాక్సర్ జుటామస్ జిట్‌పాంగ్‌తో తలపడుతోంది. ఫైనల్లో గెలిస్తే నిఖత్‌కు స్వర్ణం సొంతమవుతోంది. ఇక సెమీస్ పోరులో నిఖత్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది.

తన మార్క్ పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిఖత్ ధాటి అల్మేదా ఎదురు నిలువ లేక పోయింది. ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది. అసాధారణ ఆటతో అలరించిన నిఖత్ అలవోక విజయం ఫైనల్‌కు చేరుకుంది. ఇదిలావుండగా 57 కిలోల విభాగంలో మరో భారత బాక్సర్ మనీషా మౌన్ సెమీ ఫైనల్లోనే ఓటమి పాలైంది. ఇటలీ బాక్సర్ ఇర్మా టెస్టాతో జరిగిన పోరులో మనీషా 05 తేడాతో పరాజయం చవిచూసింది. ఇక 63 కిలోల విభాగంలో పర్వీన్ కూడా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. ఐర్లాండ్ బాక్సర్ అమీ బ్రాడ్‌హర్ట్‌తో జరిగిన పోరులో పర్వీన్14 తేడాతో కంగుతిన్నది. ఇక సెమీస్‌లో ఓడినా మనీషా, పర్వీన్‌లకు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి.

నిఖత్‌కు అభినందనలు..

మరోవైపు ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో ఫైనల్‌కు చేరుకున్న నిఖత్ జరీన్‌కు అభినంనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు నిఖత్‌ను అభినందించారు. అసాధారణ ఆటతో నిఖత్ దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేసిందని ప్రశంసించారు. ఫైనల్లో కూడా స్వర్ణం సొంతం చేసుకోవాలని వారు ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News