Wednesday, January 22, 2025

ఆసియా క్రీడలకు నిఖత్ అర్హత

- Advertisement -
- Advertisement -

Nikhat Zareen has qualified for the Asian Games

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడలకు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అర్హత సాధించింది. సెప్టెంబర్ 10 నుంచి ఆసియా క్రీడలు జరుగనున్నాయి. కాగా మహిళల 51 కిలోల బాక్సింగ్ విభాగంలో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఆసియా క్రీడల బెర్త్‌ను దక్కించుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన అర్హత పోటీల్లో నిఖత్ అద్భుత ప్రదర్శనను కనబరిచి కీలకమైన ఆసియా క్రీడలకు ఎంపికైంది. మరోవైపు యువ బాక్సర్ లవ్లీనా కూడా ఆసియా క్రీడల బెర్త్‌ను దక్కించుకుంది. కాగా ఆసియా క్రీడలకు ఎంపికైన నిఖత్ జరీన్‌ను శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. ఈ క్రీడల్లో నిఖత్ స్వర్ణంతో మెరుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News