Sunday, February 2, 2025

ఫైనల్లో నిఖత్ జరీన్

- Advertisement -
- Advertisement -

Nikhat Zareen reached the final

స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీ

సోఫియా (బల్గేరియా): ప్రతిష్టాత్మకమైన 73వ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్, తెలుగుతేజం నిఖత్ జరీన్ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు భారత్‌కే చెందిన నీతు కూడా ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల 52 కిలోల విభాగం సెమీ ఫైనల్లో నిఖత్ జయకేతనం ఎగుర వేసింది. టర్కీకి చెందిన బూస నాజ్‌తో జరిగిన పోరులో నిఖత్ 41 తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన నిఖత్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అద్భుత పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన నిఖత్ సునాయాస విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక 48 కిలోల విభాగంలో నీతు కూడా ఫైనల్‌కు చేరింది. ఉక్రెయిన్ బాక్సర్ హన్నా ఒకొటాపై నీతు విజయం సాధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News