Thursday, January 23, 2025

ఫైనల్లో లవ్లీనా, నిఖత్

- Advertisement -
- Advertisement -

భోపాల్: మహిళల జాతియ బాక్సింగ్ (ఎలైట్) ఛాంపియన్ షిప్ లో తెలంగాణ బాక్సర్, ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగిన 50 కేజీల విభాగంలో సెమీఫైనల్లో నిఖత్ జరిన్ ఎఐపికి చెందిన శివిందర్ కౌర్ సిదుపై 50తేడాతో గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించింది. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిఖత్ ఈ టోర్నీలో బంగారు పతకం కైవసం చేసుకునే క్రమంలో ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 50కేజీల గోల్డ్‌మెడల్ బౌట్‌లో నిఖత్ అనామికతో తలపడనుంది.

మరోవైపు ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా, మంజురాణి సిమ్రన్‌జిత్ ఆయా విభాగాల్లో ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రపంచ యూత్ ఛాంపియన్, నేషనల్ గేమ్స్‌లో బంగారు పతక విజేత, ఆసియా కాంస్య పతక విజేత అంకుషిత కూడా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రపంచ యూత్ ఛాంపియన్ అరుంధతి చౌదరితో 75కేజీల విభాగంలో లవ్లీనా తుదిపోరులో తలపడనుంది. కాగా ప్రతిష్ఠాత్మక ఈ ఈవెంట్‌లో 302మంది బాక్సర్లు 12 కేటగిరిల్లో పోటీపడ్డారు. ఫైనల్స్ నేడు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News