Friday, January 10, 2025

డిఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన నిఖత్ జరీన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి)గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్‌ను కలిసి తన జాయినింగ్ లేఖను అందజేశారు. నిఖత్ జరీన్‌ను డిఎస్‌పిగా నియమిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ బాక్సింగ్‌లో నిఖత్ జరీన్ అసాధారణ ప్రతిభతో రాష్ట్ర, దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఈ పదవిని అప్పగించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News