Saturday, December 21, 2024

భారత్ ప్ర’పంచ్’

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ నిఖత్ జరీన్‌కు
వరల్డ్ బాక్సింగ్‌లో పసిడి

ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 5వ బాక్సర్
52 కిలోల విభాగంలో ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌పై 5-0తేడాతో ఘన విజయం

మనతెలంగాణ/హైదరాబాద్: భారత బాక్సింగ్ సంచలనం, తెలంగాణ ఆణిముత్యం నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. గురువారం జరిగిన 52 కిలోల విభాగం ఫైనల్లో నిఖత్ 50 తేడాతో థాయిలాండ్ బాక్సర్ జిట్‌పాంగ్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి ఐదో భారత బాక్సర్‌గా నిఖత్ రికార్డు సృష్టించింది. అంతేగాక ప్రపంచ పోటీల్లో స్వర్ణం సాధించిన తొలి తెలంగాణ బాక్సర్‌గా కూడా నిఖత్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.

సిఎం కెసిఆర్ అభినందనలు

ప్రతిష్టాత్మక ’ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్’ పోటీల్లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడావేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమని అన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని, తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సీఎం కేసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News