Monday, January 20, 2025

నిఖత్ పసిడి పంచ్

- Advertisement -
- Advertisement -

మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తరువాత ఒకటికంటే ఎక్కువసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా టైటిల్‌ను సొంతం చేసుకున్న రెండో భారత బాక్సర్‌గా రికార్డు సృష్టించింది. 50కిలోల కేటగిరీలో నిఖత్ జరీన్ రెండుసార్లు ఆసియా ఛాంపియన్ న్గుయెన్ థి టామ్‌పై సంచలన సాధించి ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా ష్ట్రివతరించింది.

ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్‌పోరులో వియత్నాంకు చెందిన న్గుయెన్ థి టామ్‌పై నిఖత్ 50 తేడాతో గెలిచి ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. ఇక రెండో ఫైనల్‌లో 75కిలోల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్ పసిడి పతకాన్ని గెలుచుకొని తొలిసారి ప్రపంచ చాంపియన్ టైటిల్‌ను ముద్దాడింది. లవ్లీనా రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత, ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్‌తో తలపడింది.

టైటిల్ పోరులో పార్కర్‌ను 52 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో లవ్లీనా ఆస్ట్రేలియా బాక్సర్ పార్కర్‌పై స్లిట్ డెసిషన్ ద్వారా విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News