Monday, December 23, 2024

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గెలుపు

- Advertisement -
- Advertisement -

భోపాల్:  ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌-2022లో  సత్తా చాటింది. స్వర్ణం గెలిచి తెలంగాణకు వన్నె తెచ్చింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న ఈ జాతీయ టోర్నీలో నిఖత్‌, రైల్వేస్‌ బాక్సర్‌ అనామికతో  అమీతుమీ తేల్చుకుంది. ఫైనల్లో అనామికను 4-1 తేడాతో ఓడించింది. తెలంగాణకు  కీర్తిని తెచ్చిపెట్టింది. 50 కేజీల విభాగంలో ఫైనల్లో నిఖత్ జరీన్ అనామికను ఓడించింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో 5-0తో ఆలిండియా పోలీస్‌ (ఏజీపీ) జట్టు బాక్సర్‌ శివేందర్‌ కూర్‌ సిద్ధూను నిఖత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఐదు రౌండ్లలో కేవలం చివరి దాంట్లో మాత్రమే జరీన్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లను దక్కించుకోగలిగింది. కామన్‌వెల్త్ గేమ్స్ 2022, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో నిఖత్ టైటిళ్లను గెలుచుకొన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News