Wednesday, January 22, 2025

అది తెలుగు సినిమా గొప్పతనం

- Advertisement -
- Advertisement -

Nikhil Siddharth Speech at Karthikeya 2  Success Meet

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. మాకు ఇంత బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు చందుమొండేటి, నిఖిల్, అనుపమ, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అని అన్నారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో ప్రస్తుతం నిఖిల్ గురించి బాలీవుడ్‌లో కూడా మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ “రాజమౌళి, సుకుమార్ మన తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. వాళ్ళు వేసిన రూట్స్ వల్లనే ఈ కార్తికేయ 2 సినిమాను ఇలా తీసుకెళ్లగలిగాము. ఈ రోజు 1200 స్క్రీన్ లలో ఈ సినిమా ఆడుతుంది అంటే అది తెలుగు సినిమా గొప్పతనం”అని చెప్పారు. ఈ వేడుకలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, నిర్మాత టిజి విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల తదితరులు పాల్గొన్నారు.

Nikhil Siddharth Speech at Karthikeya 2 Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News