Sunday, December 22, 2024

ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్, దేశభక్తి ఉన్న ‘స్పై’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయమైన నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’. ఈ చిత్రాన్ని చరణ్‌తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కె.రాజశేఖర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌లో హయెస్ట్ ఓపెనింగ్స్‌తో (11.7 కోట్లు) నేషన్ వైడ్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో నిఖిల్ మాట్లాడుతూ “దర్శకుడు గ్యారీ సినిమాను చాలా కొత్తగా, రిచ్‌గా చూపించారు.

సినిమా చూసిన ప్రేక్షకులంతా మంచి సినిమా అందించామని అభినందిస్తున్నారు. ‘స్పై’లో ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్, దేశభక్తి అన్నీ ఉన్నాయి”అని తెలిపారు. చరణ్ తేజ్ మాట్లాడుతూ “సినిమాలోని కామెడీ, యాక్షన్ సహా అన్నీ ఎలిమెంట్స్ చక్కగా వర్కవుట్ అయ్యాయి. సినిమాకు ఇంత బిగ్ ఓపెనింగ్స్ రావడం హ్యాపీగా ఉంది”అని పేర్కొన్నారు. గ్యారీ బిహెచ్ మాట్లాడుతూ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండడంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య మీనన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News