Monday, December 23, 2024

ప్రతి ఇండియన్ చూడాల్సిన ‘స్పై’

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మూవీ ‘కార్తికేయ 2’ తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’తో వస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని తేజ్ ఉప్ప లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కె.రాజశేఖర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ “హీరో నిఖిల్ ‘హ్యాపీ డేస్’లో పక్కింటి కుర్రాడి పాత్రతో మొదలుపెట్టి స్వామిరారా, కార్తికేయ చిత్రాలతో తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసి కార్తికేయ 2 సినిమాతో బాక్సాఫీసుని షేక్ చేశాడు.

ఇప్పుడు స్పై మూవీతో నెక్స్ లెవెల్‌కు వెళ్తాడని భావిస్తున్నాను”అని అన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ “స్పై చాలా మంచి సినిమా. నేతాజీ జీవితం చుట్టూ తిరిగే సినిమా ఇది. గర్వపడే సినిమా చేశాం. స్పై… ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో పాటు చూడాల్సిన సినిమా”అని తెలిపారు. దర్శకుడు గ్యారీ బి.హెచ్ మాట్లాడుతూ “ఈ సినిమాతో రెండేళ్ళ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది చాలా బ్యూటీఫుల్ జర్నీ. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్యా మీనన్, శ్రీచరణ్ పాకాల, రాజశేఖర్, కార్తిక్ దండు, జిష్షు సేన్ గుప్తా, ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్, వంశీ పచ్చిపులుసు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News