Monday, January 20, 2025

‘స్వయంభూ’ ఫెరోషియస్ ఫస్ట్ లుక్

- Advertisement -
- Advertisement -

హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ 20వ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. #నిఖిల్20కి ‘స్వయంభూ’ అనే టైటిల్ పెట్టారు.

స్వయంభూ అంటే స్వయంగా ఉద్భవించినదని అర్ధం. ‘ ఫస్ట్-లుక్ పోస్టర్ లో నిఖిల్‌ యుద్ధభూమిలో ఫెరోషియస్ వారియర్ గా కనిపించారు . పొడవాటి జుట్టు, ఒక చేతిలో ఆయుధం (ఈటె) , మరొక చేతిలో షీల్డ్‌తో పోరాట యోధుడిలా కనిపించారు. నిఖిల్ గెటప్, మేకోవర్ అద్భుతంగా వుంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ తో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ సినిమాగా స్వయంభూ నిలవనుంది. ఇది అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News