Monday, December 23, 2024

దుర్గం చెరువులో నిఖిల్ మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

Nikhil's body was found in Durgam pond

హైదరాబాద్ : రెండు రోజుల క్రితం సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిన యువకుడి మృతదేహం దుర్గం చెరువులో శుక్రవారం లభించింది. పోలీసుల కథనం ప్రకారం…మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బుద్దవనం నిఖిల్ (17) ఇంటర్ మీడియట్ చేస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన తండ్రి నిర్వహిస్తున్న సాయి రాం ఇంటర్ నెట్ షాపుకు వచ్చి బ్యాగు అక్కడ పెట్టి బయటికి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో తండ్రి నిఖిల్ ఫోన్‌కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే నిఖిల్ బ్యాగును పరిశీలించగా నా చావుకు ఎవరూ కారణం కాదని, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసిన సూసైడ్ నోట్ లభించింది.

‘ నేను ఇవ్వాల 8 గంటలకు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకుతున్నా, బ్రతికి ఉంటే ఈ లెటర్ అవసరం లేదు, నేను మరణిస్తే నా ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి సమాచారం పంపండి, నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని రాశాడు. అది చూసిన తండ్రి వెంటనే తల్లిదండ్రులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే యువకుడి ఆచూకీ కోసం రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే దుర్గం చెరువులో నిఖిల్ మృతదేహం లభ్యమైంది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ ఇన్స్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News