Sunday, January 5, 2025

తిరుపతిలో 25వ ఏప్రిలియా ఆర్ఎస్ 457ను డెలివరీ చేసిన నికి మోటర్స్

- Advertisement -
- Advertisement -

తిరుపతి: పియాజియో ఇండియా యొక్క ప్రతిష్టాత్మక ద్వి చక్ర వాహన బ్రాండ్‌లు వెస్పా మరియు ఏప్రిలియాలకు అధీకృత రిటైలర్ అయిన నికి మోటార్స్, ఈరోజు తిరుపతిలోని రేణిగుంట రోడ్‌లో ఉన్న తమ ప్రీమియం షోరూమ్‌లో శ్రీ కందాల పునీత్ కృష్ణకు నగరం యొక్క 25వ ఏప్రిలియా ఆర్ఎస్ 457ను డెలివరీ చేసింది. శ్రీ కందాల పునీత్ కృష్ణ తన అధిక పనితీరు గల ఏప్రిలియా ఆర్ఎస్ 457ను ఒపలెసెంట్ లైట్‌లో పొందటం ద్వారా ఏప్రిలియా ఇండియా స్పోర్ట్స్ బైక్ మరియు రేసింగ్ కమ్యూనిటీలో చేరారు. ఈ వాహనాన్ని ఆయనకు తిరుపతి డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ నాయుడు, నికి మోటర్స్ సీఈవో నాగభూషణ్ రెడ్డితో కలిసి అందజేశారు.

తన ఏప్రిలియా ఆర్ఎస్ 457 డెలివరీని తీసుకున్న, కందాల పునీత్ కృష్ణ మాట్లాడుతూ, “ఏప్రిలియా ఆర్ఎస్ 457ని ఇంటికి తీసుకెళ్లడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బైక్ యొక్క పనితీరు అసాధారణమైనది. నా స్పోర్ట్స్ బైక్ రైడింగ్ ప్రయాణాన్ని ఏప్రిలియాతో ప్రారంభించాలని నేను కోరుకున్నాను. నికి మోటర్స్ వారు అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు. ఏప్రిలియా ఆర్ఎస్ 457 మూడు విభిన్న రంగులు – రేసింగ్ స్ట్రిప్స్, ఒపలెసెంట్ లైట్ మరియు ప్రిస్మాటిక్ డార్క్- తో వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్స్-షోరూమ్ ధర 4.11 లక్షల రూపాయలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News