Thursday, January 23, 2025

నిక్కీ హేలీకి తొలి విజయం… డీసీ ప్రైమరీలో ట్రంప్‌పై గెలుపు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారతసంతతి నాయకురాలు నిక్కీ హేలీ ఎట్టకేలకు తొలి విజయం సొంతం చేసుకున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (డిసి) ప్రైమరీ ఎన్నికల్లో ఆదివారం ఆమె గెలుపొందారు. దీంతో రేసులో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ విజయపరంపరకు బ్రేక్ పడ్డట్టయింది. అయితే ఆయనను అధిగమించడానికి వచ్చే మంగళవారం జరగనున్న పలు ప్రైమరీల్లో నిక్కీ భారీ గెలుపు నమోదు చేయాల్సి ఉంటుంది.

సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినా లోనూ నిక్కీ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రేసు నుంచి వైదొలగడానికి నిరాకరించారు. ఓవైపు ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ఆయనకు ప్రత్యామ్నాయం తానేనంటూ నిక్కీ ప్రచారం చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా డెమోక్రాట్లకు కంచుకోట. అక్కడ బాధిత రిపబ్లికన్ల సంఖ్య 23,000 మాత్రమే. 2020లో అధ్యక్షుడు జో బైడెన్ తమ పార్టీ ప్రైమరీలో 92 శాతం ఓట్లు పొందారు.

మరోవైపు ట్రంప్ శనివారం మిసోరి, మిషిగన్, ఐడహో ప్రైమరీల్లోనూ నిక్కీపై ఘన విజయం సాధించారు. ఆయన నెగ్గిన ప్రతినిధుల సంఖ్య 244 కు చేరుకుంది. హేలీ ఖాతాలో 24 మంది మాత్రమే ఉన్నారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిలవాలంటే 1215 మంది ప్రతినిధులను సొంతం చేసుకోవాలి. ప్రస్తుతం ట్రంప్ దూకుడు చూస్తుంటే ఈ సంఖ్యను ఆయన మంగళవారం జరిగే 15 రాష్ట్రాల ప్రైమరీల్లో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News