Sunday, November 24, 2024

ట్రంప్ మానసిక స్థితి సరిగ్గా లేదు : నిక్కీ హేలీ విమర్శలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ అభ్యర్థిగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై శనివారం విమర్శలు సంధించారు. ట్రంప్ మానసిక స్థితి సరిగ్గా లేదని, అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా ? అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ప్రజలు మరో వ్యక్తిని అధ్యక్షుడుగా కోరుకుంటారని నిక్కీ హేలీ తెలిపారు.

2021 జనవరి6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడిని ఆపటంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. అయితే శుక్రవారం రాత్రి ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఆనాటి సంఘటన ప్రస్తావించారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనం పైన జరిగిన దాడి విషయంలో తాను భద్రత కల్పించలేక పోయినట్టు పార్టీ వర్గాలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. తాను ఎందుకు ఆ హింసాత్మక సంఘటనకు బాధ్యత వహిస్తానని ప్రశ్నించారు. కనీసం తాను అప్పుడు ఆఫీస్‌లో కూడా లేనని పేర్కొన్నారు.

ట్రంప్ అప్పటి అమెరికన్ హౌజ్ ( ప్రతినిధుల సభ ) స్పీకర్ అయిన నాన్సీ పెలోసీని దృష్టిలో పెట్టుకొని పొరపాటు పడుతూ తనపై విమర్శలు చేస్తున్నారని నిక్కీహేలీ ఎద్దేవా చేశారు. దీంతో ఆయన మానసిక స్థితి ఏంటో తెలుస్తోందని మండిపడ్డారు. ట్రంప్ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని తెలపడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. తాను ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. ఎంతో ఒత్తిడితో కూడుకున్న అగ్రరాజ్య అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక పరిస్థితి సరిపోతుందా అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News