Wednesday, January 22, 2025

అమెరికా అధ్యక్ష బరికి హేలీ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికల బరి నుంచి నిక్కి హేలీ వైదొలగనుంది. లిగారు. దీనితో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ అభ్యర్థిత్వానికి ఎదురులేని స్థితి ఏర్పడింది. తాను ప్రైమరీ బరి నుంచి నిష్క్రమిస్తున్నట్లు మాజీ రాయబారి, ఒకప్పుడు ట్రంప్ మద్దతుదారుగా పేరోందిన హేలీ తెలిపారు. ఇక పార్టీ నుంచి ఏకైక అభ్యర్థిగా ట్రంప్ మిగులుతారని ఆమె సంకేతాలు వెలువరించారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఏడాది చివరి దేశాధ్యక్ష ఎన్నికల బరిలో ఇక బైడెన్ ట్రంప్ నడుమనే పోరు సాగుతుందని వెల్లడైంది. నిక్కి హేలీ పోటీ విరమణ ప్రకటనను అధికారికంగా సౌత్ కరోలినా రాజధాని చార్లెస్టన్ నుంచి వెలువరించనున్నారు. ఇంతకు ముందు ఆమె ఇక్కడ గవర్నర్‌గా వ్యవహరించారని, అందుకే ఈ వేదిక నుంచి తమ నిర్ణయం ప్రకటిస్తారని అమెరికా మీడియా తెలిపింది. 2024 ఎన్నికల బరిలో హేలి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థినిగా ఇటీవలే విస్మయకర రీతిలో రెండు విజయాలు సాధించారు.

అయినప్పటికీ ఆమె తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకోవడం మరీ విస్మయకరం అయిందని పరిశీలకులు తెలిపారు. పలు రాష్ట్రాలలో పాతకాపు డొనాల్డ్ ట్రంప్ తమ ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. సూపర్ ట్యూస్‌డే ప్రైమరీలో కూడా ఘన విజయం తరువాత ఆయన గత రాత్రి తన అనుచరులతో అమేజింగ్ నైట్ ఉత్సవాలలో పాల్గొన్నారు. దీనితో తాను అధ్యక్ష పోటీ బరిలో ఇక ఖాయం అనే విషయాన్ని చాటుకున్నారు. హేలీ వ్యూహాత్మకంగానే ట్రంప్‌పై ఇంతకాలం పోటికి దిగిందని, ఇతర ప్రత్యర్థులు తెరమీదికి రాకుండా చూసుకుని, ఇప్పుడు ట్రంప్ పోటీకి లైన్‌క్లియర్ చేసేసి గుడ్‌బై కొడుతోందని కొందరు చెపుతున్నారు. గడిచిన ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమె పోటికి సిద్ధపడ్డారు. ఇప్పుడు బరిలో ఆమె లేకపోవడంతో ట్రంప్ ఇక కేవలం బైడెన్‌తో పోటికి ఎంత సమర్థవంతంగా తనను తాను రెడి చేసుకోవాల్సి ఉంటుందనే విషయంపైనే దృష్టి సారిస్తారు.

ఈ క్రమంలోనే ఆయనపై పలు కోర్టులలో ఉన్న కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేతలకు గురి కావడం కూడా కీలక పరిణామం అయింది. ఈ నెలాఖరులో రిపబ్లికన్ పార్టీ నామినికి అవసరం అయిన 1215 డెలిగేట్స్ సంఖ్యాబలాన్ని ట్రంప్ అవలీలగా సంతరించుకుంటారని వెల్లడవుతోంది. తన పార్టీలో అత్యంత శక్తివంతుడిగా ట్రంప్ సంతరించుకునే బలం మరో వైపు అధికార డెమోక్రటిక్ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు వీలు కల్పిస్తుంది. ఇప్పుడు ఇంతకాలం హెలీ కోసం పాటుపడ్డ మద్దతుదార్లు, డోనర్లు , ట్రంప్ వద్దనుకుంటున్న ఓటర్లు ఇప్పటి పరిణామాలతో కంగుతింటున్నారు. తాను వైస్ ప్రెసిడెంట్ ఇతర పదవులు ఏమీ ఆశించడం లేదని హెలీ తెలిపారు. ఎవరైతే పార్టీ అభ్యర్థిగా నామిని అవుతారో వారికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పుడు కాకుండా ఆ తరువాతి దేశాధ్యక్ష ఎన్నికకు బలీయ అభ్యర్థినిగా వస్తానని తన మద్దతుదార్ల వద్ద ఆమె చెప్పినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News